బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ పై సంచలన ఆరోపణలు చేసింది నటి తనుశ్రీ దత్తా. తనను ఆయన లైంగిక వేధింపులకు గురి చేశాడని సంచలన ఆరోపణను తెర మీదకు తెచ్చింది తనూశ్రీ. 2008లో ఒక సినిమా షూటింగ్ సమయంలో నానా తనను ఇబ్బంది పెట్టాడని ఆమె ఆరోపించింది. ఒక పాట షూట్లో తనతో నానా అనుచితంగా ప్రవర్తించాడని ఆమె వ్యాఖ్యానించింది.
అప్పట్లో తనూశ్రీ బిజీ హీరోయిన్ గా ఉండింది, అయితే అవకాశాలు తగ్గుముఖం పట్టాకా ఈమె తెరమరుగు అయ్యింది. కొన్నాళ్ల పాటు విదేశాల్లో ఉండి వచ్చింది. తాజాగా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల అంశాలు చర్చలో ఉన్న నేపథ్యంలో తనూ శ్రీ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పింది.
ఇది వరకూ చాలా మంది హీరోయిన్లు ఈ తరహా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనూశ్రీ మరో అడుగు ముందుకు వేసి.. తనను వేధించిన నటుడి పేరు కూడా చెప్పింది. సీనియర్ నటుడిపై సంచలన ఆరోపణలు చేసింది మరి దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో!
No comments:
Post a Comment