ఆత్మహత్యల్లో ముందున్న భారతీయ మహిళలు! - Andhra Global

Breaking

Post Top Ad

Responsive Ads Here

Tuesday, September 25, 2018

ఆత్మహత్యల్లో ముందున్న భారతీయ మహిళలు!


ప్రపంచ వ్యాప్తంగా మనుషుల్లో చోటు చేసుకుంటున్న ఆత్మహత్యల విషయంలో జరిగిన ఒక అధ్యయనం సంచలన ఫలితాలను వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్లలో జండర్ తారతమ్యాలు ఎలా ఉన్నాయి? అనే అంశం గురించి శోధించిన ఒక సంస్థ.. భూ ప్రపంచం మీద ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో భారతీయ మహిళలు ముందున్నారని పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న ఆత్మహత్యల్లో మహిళ సంఖ్యను పక్కన పెట్టి చూస్తే.. వారిలో భారతీయ మహిళ వాటా 37 శాతమని ఈ అధ్యయనం చెప్పడం విశేషం. అంటే ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రతి వంద మంది మహిళల్లో 37 మంది భారతీయులే ఉన్నట్టు. ఇది అత్యంత విస్మయకరమైన విషయం అని చెప్పవచ్చు.

ఇక మరణిస్తున్న మహిళల్లో ప్రపంచ వ్యాప్తంగా లక్షకు ఏడు మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇండియాలో మాత్రం లక్షకు 15 మంది ఈ తరహాలో చనిపోతున్నారట. అది కూడా ఇలా చనిపోతున్న వారిలో 40 యేళ్ల లోపు మహిళలే ఎక్కువమంది అని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here