జగన్ పాదయాత్ర@3000Km,వైసీపీలో కొత్త ఊపు! - Andhra Global

Breaking

Post Top Ad

Responsive Ads Here

Tuesday, September 25, 2018

జగన్ పాదయాత్ర@3000Km,వైసీపీలో కొత్త ఊపు!



వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని దాటిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్సాహవంతమైన కార్యక్రమాలను చేపట్టింది. జగన్ పాదయాత్ర మరో మైలు రాయిని దాటిన నేపథ్యంలో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిలు, నేతలు ఎక్కడిక్కడ పాదయాత్రలు చేశారు.

ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ నేతలు ఈ యాత్రలను చేపట్టారు. తద్వారా జగన్ పాదయాత్రను చర్చనీయాంశంగా మార్చారు వైసీపీ ఇన్ చార్జిలు.

ఇక మరోవైపు వైసీపీ మరో కార్యక్రమంతో కూడా జనాల్లోకి వెళుతోంది. ‘రావాలి జగన్, కావాలి జగన్’ పేరుతో మరో కార్యక్రమాన్ని చేపట్టింది. నియోజకవర్గాల వారీగా వైసీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇళ్లిళ్లూ తిరుగుతూ తమ పార్టీకి అధికారం ఇవ్వాలని వైసీపీ నేతలు కోరుతున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here