హీరోయిన్ చెల్లెలుకు ఛాన్సివ్వనున్న హీరో? - Andhra Global

Breaking

Post Top Ad

Responsive Ads Here

Tuesday, September 25, 2018

హీరోయిన్ చెల్లెలుకు ఛాన్సివ్వనున్న హీరో?

బాలీవుడ్ లో కత్రినా కైఫ్ ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి సల్మాన్ ఖాన్. ఎక్కడో బ్రిటన్ నుంచి వచ్చిన ఈ భామ మోడల్ గా అవకాశాల కోసం యత్నిస్తుండేది. అడపాదడపా వచ్చిన సినిమాలు చేసేది. అందాలు ఆరబోస్తున్నా.. అవకాశాలు అంతంతమాత్రంగానే ఉండేవి! అలాంటి సమయంలో సల్మాన్ కు సన్నిహితురాలే పేరు
ను తెచ్చుకుంది కత్రినా!

అప్పట్లో ఒక కేసులో సల్లూ జైలుకు వెళ్లగా.. జైలు ముందు విషాన్ణ వదనంతో కనిపించింది కత్రినా. ఆ తర్వాత ఈమెకు బాలీవుడ్ లోఅవకాశాలు పెరిగాయి. సల్మాన్ తో కూడా అవకాశం వచ్చింది. అక్కడ నుంచి ఆమె గీత మారిపోయింది! టాప్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లింది. అయితే అలా ఎదిగిన తర్వాత సల్లూతో కత్రినాకు దూరం పెరిగింది. అది వేరే సంగతి.

అదలా ఉంటే.. ఇప్పడు కత్రినా చెల్లెళ్లపై సల్లూ దృష్టి పెట్టాడనే మాట వినిపిస్తోంది. కత్రినా చెల్లెలు ఇసబెల్లా సినిమాల్లోకి రావాలని భావిస్తోందట. అక్కకు ఏ మాత్రం తీసిపోని అందగత్తె అయిన ఈమె.. బాలీవుడ్ కు హీరోయిన్ గానే ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటోందట. ఈ నేపథ్యంలో సల్మాన్ అండగా నిలవబోతున్నాడని సమాచారం. తను నిర్మాతగా వ్యవహరించి రూపొందే సినిమాలో కత్రినా చెల్లెలును హీరోయిన్ గా నటింపజేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఈ హీరో! మరి అక్కకే గాక.. చెల్లెలుకు కూడా సల్మాన్ బాలీవుడ్ లో లైఫిస్తున్నాడేమో! 

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here