అల్లరినరేష్ హీరోయిన్, చాలా హాట్‌గా! - Andhra Global

Breaking

Post Top Ad

Responsive Ads Here

Tuesday, September 25, 2018

అల్లరినరేష్ హీరోయిన్, చాలా హాట్‌గా!


మంజరీ ఫడ్నీస్.. తెలుగులో చేసింది చిన్న సినిమాలే అయినా, నటనా ప్రతిభను మాత్రం చాటుకుంది. అయితే స్టార్ సరసన అవకాశాలు రాకపోవడం, చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్లు నిలవకపోవడంతో మంజరీ పరిస్థితి మెరుగు కాలేకపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ లో అడపాదడపా ప్రయత్నాలు చేస్తూ తన కెరీర్ ను కొనసాగిస్తోంది ఈమె.

ఒక దశలో అల్లరి నరేష్ ఎంకరేజ్ మెంట్ ఈ భామకు దండిగానే ఉందనే ప్రచారం జరిగింది. వీరిద్దరి మధ్య ఎఫైర్ అనే వార్తలు కూడా వచ్చాయి. తన సినిమాల్లో
నరేష్ ఈమెకు అవకాశాలు ఇప్పిస్తున్నాడనే మాట వినిపించింది. అయితే ఆ వార్తలను వీరు ఖండించారు.

ఆ సంగతలా ఉంటే.. ఇటీవల ఈమె ఇన్ స్టాగ్రమ్ లో పోస్టు చేసిన ఫొటోలు హాట్ టాపిక్ గా మారాయి. తీర దేశం షీ షెల్స్ లో పర్యటించిందట మంజరీ. సరదాగా గడిచిన ఆ టూర్లో ఈమె దిగిన ఫొటోలు హీటెక్కిస్తున్నాయి. స్విమ్ సూట్ లో తలతలలాడే తీరంలో.. తలతలలాడే తన అందాలను ప్రదర్శించింది మంజరీ. పెద్దగా సినిమాల్లేక ఎవరికీ పట్టకుండా పోయిన మంజరిని అమాంతం వార్తల్లోకి తీసుకొచ్చాయి ఈ ఫొటోలు! మరి మళ్లీ ఈమెపై తెలుగు సినిమా వాళ్ల  కన్నుపడుతుందేమో చూడాలి వీటి వల్ల. 

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here