మరో సౌత్ సినిమాలో అమితాబ్? - Andhra Global

Breaking

Post Top Ad

Responsive Ads Here

Tuesday, September 25, 2018

మరో సౌత్ సినిమాలో అమితాబ్?

నందమూరి బాలకృష్ణ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రైతు’ సినిమా ప్రతిపాదనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రకు అమితాబ్ అయితేనే కరెక్ట్ అనేది కృష్ణవంశీ వాదన. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగానే తెలిపాడు. దీనిపై స్పందిస్తూ బాలయ్య ముంబై వెళ్లి అమితాబ్ ను కలవడం కూడా జరిగింది. సర్కార్- త్రీ సెట్స్ పై అమితాబ్్ తో సమావేశమై.. ‘రైతు’ సినిమా గురించి విశదీకరించాడు బాలయ్య.

అయితే ఈ తెలుగు సినిమాలో నటించడానికి అమితాబ్ ఓకే చెప్పలేదు. ప్రస్తుతం వీలు కాదనే సంకేతాలను ఇచ్చాడట బిగ్ బి. దీంతో ఆ సినిమా తాత్కాలికంగా ఆగిపోయింది. అమితాబ్ మాత్రమే ఆ సినిమాను చేయాలనేది కృష్ణవంశీ కోరిక. అయనేమో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం అమితాబ్ ‘సైరా’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఆ సంగతలా ఉంటే.. మరో దక్షిణాది సినిమా విషయంలో అమితాబ్ పేరు వినిపిస్తోంది. మోహన్ లాల్ హీరోగా నటించే ఒక మాలయాళీ సినిమాలో అమితాబ్ ను నటింపజేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయట. వారు కూడా ఇప్పటికే అమితాబ్ ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది.

మరి ఇది వరకూ ఒక మలయాళీ సినిమాలో మెరిశాడు బిగ్ బి. అది కూడా మోహన్ లాల్ దే. అలాగే.. ‘ఆగ్’ లో మోహన్ లాల్- అమితాబ్ లు నటించారు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు మలయాళీ సినిమాకు బిగ్ బీ ఓకే చెబుతాడా? తెలుగు సినిమాను కాదనుకుని.. ఆ సినిమాకు  ప్రాధాన్యతను ఇస్తాడేమో చూడాలి!

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here