విలన్‌గా జగపతి ఎంత తీసుకుంటున్నాడు? - Andhra Global

Breaking

Post Top Ad

Responsive Ads Here

Tuesday, September 25, 2018

విలన్‌గా జగపతి ఎంత తీసుకుంటున్నాడు?


పేరున్న నిర్మాత తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చినా.. అందుకు తగ్గ ఓపెనింగ్ లభించలేదు జగపతి బాబుకు. హీరోగా చేసిన తొలి తొలి సినిమాల్లో ఫ్లాఫులే ఎక్కువ! ‘పెద్దరికం’ సినిమాతో దశ తిరిగింది. ‘గాయం’ తో మంచి పేరొచ్చింది. ఆ తర్వాత రూటు మార్చి చేసిన ‘శుభలగ్నం’, ‘మావిచిగురు’ వంటి ఫ్యామిలీ సినిమాలతో ప్రామిసింగ్ యాక్టర్ అనిపించుకున్నాడు. అలాంటి సినిమాలకు కాలం చెల్లిపోయాకా జగపతి కెరీర్ ప్రమాదంలో పడింది. కొన్ని యాక్షన్ సినిమాల్లో ట్రై చేసినా.. ప్రయోజనం లేకపోయింది!

కొన్నాళ్ల కిందట వరకూ జగపతి బాబు ఎవ్వరికీ పట్టకుండా పోయాడు. అయితే విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలను చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఈయన దశ తిరిగింది. ఇప్పుడు చేతి నిండా సినిమాలు.. తెలుగుతో పాటు, తమిళ- మలయాళీ ఇండస్ట్రీలోనూ మంచి మంచి అవకాశాలు జగపతికి దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈయన రెమ్యూనరేషన్ కూడా బాగా ఉందనే మాట వినిపిస్తోంది.

విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్ కు కోటిన్నర తక్కువ కాకుండా తీసుకుంటున్నాడట జగపతి. అదే భారీ బడ్జెట్ సినిమా అయితే కనీసం రెండు కోట్ల రూపాయల వరకూ అడిగి తీసుకున్నాడట, మరి హీరోగా సినిమాలు చేసిన రోజుల కంటే.. విలన్ గానే జగపతి బాబు ఎక్కువ పారితోషకాన్ని తీసుకుంటున్నట్టుగా ఉన్నాడు. కాలం అలా కలిసి వచ్చింది మరి!

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here