సెక్స్‌తో ఈ బెనిఫిట్స్ ఉంటాయ్! - Andhra Global

Breaking

Post Top Ad

Responsive Ads Here

Tuesday, September 25, 2018

సెక్స్‌తో ఈ బెనిఫిట్స్ ఉంటాయ్!



సెక్సువల్ లైఫ్ లో యాక్టివ్ గా ఉంటే వారికి దీని ఫలితంగా శారీరకంగా, మానసికంగా ఎన్నో లాభాలుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఒకటని కాదు… ఎన్నో లాభాలు అంటూ వీరు ఊరిస్తున్నారు. రాయల్ ఎడిన్ బర్గ్ పరిశోధకులు అయితే.. తమ పదేళ్ల పరిశోధనల ఫలితంగా సెక్స్ లైఫ్ గురించి గొప్ప విషయాన్ని కనుగొన్నామని చెబుతున్నారు. శృంగార జీవితంలో యాక్టివ్ గా ఉండే దంపతులు… యంగ్ గా కనిపిస్తారని వీరు చెబుతున్నారు. ఎంత యంగ్ గా అంటే.. వీళ్ల వయసు కనీసం ఏడెనిమిదేళ్లు తక్కువ అనిపిస్తుందని ఇక్కడి క్లినికల్ న్యూరో సైకాలజిస్టులు చెబుతున్నారు! శృంగారం మహత్తు ఆ స్థాయిలో ఉంటుందని వివరించారు.

ఫెర్టిలిటీ పెరుగుతుంది..
పిల్లలు కావాలనుకునే దంపతులకు ఏకైక టెక్నిక్ తరచూ.. శృంగారంలో పాల్గొంటుండమే అని, మార్గమూ ఇదే, కిటుకూ ఇదే పరిశోధకులు అంటున్నారు. తరచూ సెక్స్ లో పాల్గొనే పురుషుడి ఫెర్టిలిటీ రేటు పెరుగుతుందని పరిశోధనలో తేలిందట!

రోగ నిరోధకత పెరుగుతుంది..
డీహెచ్ఈఏ.. దీన్ని ది యాంటీ ఏజింగ్ హర్మోన్ గా వ్యవహరిస్తారు. శృంగారంలో పాల్గొన్న వేళ శరీరంలో ఇది దండిగా విడుదల అవుతుందని, ఇది శరీరాన్ని ఆవహించడం వల్ల రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. శరీరాన్ని ఫిట్టర్, లాంగర్ గా ఉంచగలదట ఈ హార్మోన్. దీని కీ శృంగారంతోనే ముడిపడి ఉంది.

లాంగ్ లైఫ్..
నెలలో ఒకసారి శృంగారంలో పాల్గొనే వారితో, నెలకు మూడు సార్లకు పైగా శృంగారంలో పాల్గొనే వారి ఆరోగ్యాన్ని పోల్చితే.. ఈ రెండో కేటగిరిలోని వారు ఎక్కువ కాలం జీవిస్తారని ఆస్ట్రేలియన్ పరిశోధకులు చెబుతున్నారు. రెండో కేటగిరిలోని వారు మెడికల్  రీజన్స్
తో మరణించడం 50 శాతం వరకూ తక్కువ అని వీరి అధ్యయనంలో తేలిందట.

ఇంకా.. తరచూ శృంగారాన్ని ఆస్వాధించే వారికి గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయని క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధన చెబుతోంది. గాఢమైన శృంగారాసక్తితో అనునిత్యం దాన్ని ఆస్వాధించే వారిలో అపోజిట్ సెక్స్ ను ఆకర్షించే శక్తి పెరుగుతుందని మరో పరిశోధన వివరిస్తోంది. శృంగారంతో విడుదలయ్యే హార్మోన్ల ఫలితమే ఇదని ఈ పరిశోధన సారాంశం.

ఇలా చెప్పుకొంటూ పోతే ఇంకా ఎన్నో.. సర్వ ఆనందానికీ, సర్వ రోగ నివారణలకు.. సెక్స్ ఒక గొప్ప ఔషధం అని శాస్త్రీయమైన పరిశోధనలు చెబుతున్నాయి!

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here