ఈ రోజుల్లో చాలా మంది హీరోల కూతుళ్లు, హీరోయిన్ల కూతుళ్లు హీరోయిన్లు అయిపోతూ ఉన్నారు. గతంలో అయితే హీరోయిన్ల కూతుళ్లు హీరోయిన్లు అయ్యే వాళ్లు కానీ.. ఈ రోజుల్లో పరిస్థితులు మారిపోయాయి. గతంలో హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా వచ్చే వాళ్లు కాదు. అలా ఎవరైనా వస్తామన్నా ముందుగా వారికి ఇంట్లోనే బ్రేకులు పడేవి. అలాగాక ఎవరైనా ముందుకు వస్తే అభిమాన వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యేవి. ఇలా దశాబ్దాలు గడిచాయి.ఇప్పుడు రోజులు మారాయి. చాలా మంది హీరోల కూతుళ్లు గ్లామరస్ హీరోయిన్లుగా మారిపోయారు. హీరోయిన్లుగా వారు దూసుకుపోతున్నారు. హీరోలు కూడా ఇప్పుడు కూతుళ్ల విషయంలో అభ్యంతరాలు చెప్పడం లేదు.
ఇప్పుడు హీరోయిన్లుగా ఇంట్రడ్యూస్ కావడానికి చాలా మంది హీరోల కూతుళ్లు రెడీగా ఉన్నారు. వాళ్లతో పాటు తను కూడా ఉన్నానని అంటోంది సారా టెండూల్కర్. ఈ పేరు అందరికీ తెలిసిందే. యుక్తవయసులోకి వచ్చిన సచిన్ కూతురు ఇప్పుడు గ్లామర్ వరల్డ్ ను ఆకర్షిస్తోంది. ఆమె పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలూ వస్తున్నాయి. మరి అసలు కథ ఏమిటో ముందు ముందు తెలుస్తుంది.
No comments:
Post a Comment