మోడీ పై శత్రువుల విమాన అస్త్రం ఫలిస్తుందా? - Andhra Global

Breaking

Post Top Ad

Responsive Ads Here

Tuesday, September 25, 2018

మోడీ పై శత్రువుల విమాన అస్త్రం ఫలిస్తుందా?

కిందటి వారం అంతా జాతీయ మీడియాలో ఎగరని విమాన అస్త్రం అంటూ మీడియా వర్గాలు తేల్చేశాయి. రఫెల్ డీల్ విషయంలో మోడీని లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు పసలేనివిగా మిగిలాయని జాతీయ మీడియా వర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయాన్ని అంత తేలికగా వదిలేలా లేదు.

మోడీ దోచేశాడని, కాపాలా ఉండాల్సిన వ్యక్తే  దోచి పెట్టాడని, రిలయన్స్ కు లాభం కలిగేలా వ్యవహరించాడని..మొత్తం ఇది ఇరవై వేల కోట్ల స్కామ్ అని రాహుల్ అంటున్నాడు. తాజాగా ఈ స్కామ్ గురించి సైనికులకు వివరించి చెబుతున్నట్టుగా రాహుల్ ట్వీట్ కూడా చేశాడు.

ఇక కాంగ్రెస్ తో చేతులు కలిపిన ఇతర పార్టీలు కూడా రఫెల్ డీల్ విషయంలో మోడీని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. వాటిల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. మొన్నటి వరకూ మోడీతో అంటకాగిన ఈ పార్టీ ఇప్పుడు మోడీ అవినీతి పరుడు అంటూ ధ్వజమెత్తుతోంది. మరి ఈ విమాన అస్త్రం మోడీ వ్యతిరేక శిబిరానికి ఎంత వరకూ ఉపయోగపడుతుందో చూడాల్సి ఉంది.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here